భక్తుల కోర్కెలు తీర్చే జగన్నాథుడు

PNR|
దేశంలోని ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో అహ్మదాబాద్‌లోని జగన్నాథ ఆలయం ఒకటి. ఇది పేరు ప్రఖ్యాతలకే కాకుండా.. సంపన్నతకు, అలంకారానికి, ఆధునికతకు ప్రత్యేక స్థానం ఉంది. అహ్మదాబాద్‌ నగరంలోని జమల్‌పూర్ అనే ప్రాంతంలో వెలసి వున్న ఈ ఆలయం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇలా.. చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని ఈ వారం తీర్థయాత్రలో మీకు పరిచయం చేస్తున్నాం.

సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. నర్సింగ దాస్‌జీ అనే సాధువుకు జగన్నాథుడు కలలో కనిపించి, తనకు, తన సోదరుడు బల్దేవ్, సోదరి సుభద్రలకు కలిసి ఒక ఆలయాన్ని నిర్మించాల్సిందిగా చెప్పాడట. ఈ విషయాన్ని సాధవు ఆ గ్రామ ప్రజలకు వివరించాడు. దీంతో గ్రామ ప్రజలు అత్యంత ఉత్సాహంతో, ఆనందోత్సవాల మధ్య ఆలయ నిర్మాణ పనుల్లో పాలుపంచుకోవడంతో జగన్నాథ ఆలయం నిర్మితమైంది.

ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత జగన్నాథుడు కొలువు దీరాడు. అప్పటి నుంచి ఆ గ్రామ ప్రాంత ప్రజల్లో సుఖ శాంతులు వెల్లివిరిశాయి. ఇక్కడకు వచ్చే భక్తులను అమితంగా ఆకర్షిస్తూ.. మంత్రముగ్ధులను చేసే విధంగా ఆలయంలో జగన్నాథుడు, బల్దేవుడు, సుభద్ర విగ్రహాలను ప్రతిష్టించారు. 1878 సంవత్సరంలో నిర్మితమైనది మొదలుకుని.. ఆలయంలో భక్తిభావం ఉట్టిపడుతోంది.


దీనిపై మరింత చదవండి :