కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఫలితంగా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సమర్పించిన తలనీలాలను టిటిడి జేఇఓ శ్రీనివాసరాజు నేతృత్వంలో ఈ-వేలం ద్వారా విక్రయించారు.