సంబంధిత వార్తలు
- ఇల్లు ఊడ్చడం, గిన్నెలు కడగడం వంటి పనులన్నీ చేయించారు.. యువకుడు బలవ్మరణం
- ఆధ్యాత్మిక వేడుకలో డ్యాన్స్ చేసిందనీ.. భార్యను, పిల్లలను నరికి చంపేసిన భర్త
- మొన్ననే గోవాలో కలిశాను... ఆప్యాయంగా మాట్లాడారు : భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి
- నీ కడుపులో వున్నది నా బిడ్డ కాదు, డీఎన్ఎ టెస్ట్ చేపిస్తా: భర్త వేధింపులకు గర్భిణి ఆత్మహత్య
- ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?
యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు: సభ్యురాలిగా మెగాస్టార్ సతీమణి సురేఖ
తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట ఆలయానికి ఛైర్మన్, సభ్యులను నియమించి కొత్త ఆలయ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ జాబితాలో ఉన్న ప్రముఖులలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ కూడా ఉన్నారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం ప్రకారం సరికొత్త పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే నూతన బోర్డుకు చైర్మన్ గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. బోర్డులో చైర్మన్‌తో పాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో సభ్యులుగా మొత్తం 18 మందికి చోటు దక్కింది. అయితే అనూహ్యంగా బోర్డులో సభ్యురాలిగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు చోటు కల్పించారు.
