శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By JSK
Last Modified: బుధవారం, 13 జులై 2016 (21:22 IST)

శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతల వినోదం....

తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణులలో వెలసి ఉన్న శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతలు సందడి చేస్తున్నాయి. పాదాల మండపం వద్దకు చేరుకుంటున్న భక్తులకు పాదాల దర్శనం అనంతరం ఉడతలు అదనపు వినోదాన్ని పంచుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో అణువణువూ ఆధ్యాత్మికమయమే.

ఆనంద నిలయంలో అవతరించక ముందే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భువికి వచ్చి పాదాలు మోపిన ప్రాంతం శ్రీవారి పాదాలు. ఆనంద నిలయం నుంచి అటవీ మార్గంలో 8 కిలోమీటర్లు వెలితే శ్రీవారి పాదాలు చేరుకోవచ్చు. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న రహదారి నుంచి శిలాతోరణం మీదుగా ఎత్తైన అటవీ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తూ భక్తులు పాదాల మండపానికి చేరుకుంటారు.