సంబంధిత వార్తలు
- Lord venkateswra : సర్వేశ్వరుడైన వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత భక్తునిలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసా?
- 13-06-2026 శనివారం ఫలితాలు - మంచి చేయబోతే చెడు జరుగుతుంది..
- శ్రీవారి అభిషేక సేవలో అంబానీ ఫ్యామిలీ... సర్వదర్శనానికి 18 గంటలు (video)
- 12-06-2026 శుక్రవారం ఫలితాలు... దంపతుల మధ్య కలహం
- అస్సాంలో తిరుపతి నమూనాను పోలి ఉండేలా.. శ్రీవారి ఆలయం
సెప్టెంబరు నెల శ్రీవారి దర్శన కోటా టిక్కెట్లు - 18న ఆన్‌లైన్‌లో విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించి సెప్టెంబరు నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) జూన్ 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు.. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.
22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేటాయిస్తారు.
23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకొస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల అవుతుంది.
24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (రూ.300) కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in/ వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తితిదే సూచించింది.
తర్వాతి కథనం
