1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala: 2-Wheelers Banned on Ghat Roads For Garuda Seva

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. గరుడ సేవ.. టూవీలర్స్‌పై నిషేధం

Garuda Seva
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టమైన గరుడ వాహన సేవ శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించబడుతుంది. 
 
భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రెండు రోజుల పాటు ఘాట్ రోడ్లపై ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు తెలిపారు. 
 
ఈ నిషేధం నేడు (గురువారం, అక్టోబర్ 15) రాత్రి 9 గంటల నుండి శనివారం (అక్టోబర్ 17) ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుంది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించి, స్వామివారి దర్శనం ప్రశాంతంగా సాగేలా టీటీడీకి సహకరించాలని బి.ఆర్. నాయుడు కోరారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాల రద్దీ దృష్ట్యా పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. గరుడ సేవకు వచ్చే భక్తులు తమ వాహనాలను తిరుపతిలోని నిర్ణీత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపి ఉంచి, అక్కడి నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత మరియు ప్రయాణం సులభతరం అయ్యేందుకు, పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని ఆయన కోరారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
నవరాత్రులు 2026: నవరాత్రుల్లో శ్రీ దుర్గా మంత్రాన్ని ఏ వేళలో పఠించాలంటే?