1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Tirumala Temple Records Highest Laddu Sales, Hundi Collections and Footfall In May

శ్రీవారి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం, హుండీ ఆదాయం

Lord Venkateswara
వేసవి సెలవుల రద్దీ కారణంగా, ఈ ఏడాది మే నెలలో తిరుమల పుణ్యక్షేత్రం రికార్డు స్థాయి గణాంకాలను నమోదు చేసింది. మే నెలలో ఆలయం అత్యధికంగా 1,21,35,528 లడ్డూలను విక్రయించింది. 25.46 లక్షల మంది భక్తుల రాకతో నెలవారీ భక్తుల సంఖ్యలో రికార్డు సృష్టించింది. హుండీ ద్వారా రూ. 120.28 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. శ్రీవారి ఆలయాన్ని దాదాపు 25 లక్షల మంది భక్తులు సందర్శించారు.
 
ఇది గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.8 లక్షలు ఎక్కువ. భక్తుల కదలికలను పర్యవేక్షించే ఏఐ-ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్' (ఐసీసీసీ) సహాయంతో దర్శన ప్రక్రియ సజావుగా సాగిందని ఆలయ అధికారులు తెలిపారు. క్యూ లైన్లకు అంతరాయం కలగకుండానే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య కైంకర్యాలు (ఆచారాలు) కొనసాగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. 
 
భక్తులకు సుమారు 1.12 కోట్ల అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 15.71 లక్షలు ఎక్కువ. హుండీ ఆదాయం రూ. 120 కోట్లకు చేరగా, ఆ నెలలో రికార్డు స్థాయిలో 1.21 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. 14 లక్షలకు పైగా తలనీలాల సమర్పణ జరిగింది. అలాగే బంగారం, వెండి డాలర్లు, రిసెప్షన్ సేవలు, ఇతర విభాగాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పవిత్ర వంటశాలలను నిర్వహించే పోటు విభాగం మే నెలలో దాదాపు 4.08 లక్షల లడ్డూలను తయారు చేసింది. సర్వదర్శనం కోసం భక్తులకు ప్రతిరోజూ సుమారు 17 గంటల 24 నిమిషాల సమయాన్ని కేటాయించారు. భక్తుల రాకపోకలను పర్యవేక్షించేందుకు అధికారులు స్లాటెడ్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల వివరాలను కెమెరా ఫుటేజీతో సరిపోల్చి చూశారు. 
 
మే 24న రికార్డు స్థాయిలో 98,058 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మే నెలలో నాలుగు సార్లు భక్తుల సంఖ్య 90,000 మార్కును దాటింది. అలాగే, మే 3న హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో రూ. 5.06 కోట్లకు చేరింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
05-06-2026 శుక్రవారం ఫలితాలు- రావలసిన ధనాన్ని చాకచక్యంగా రాబట్టుకోవాలి