శ్రీరామ చంద్రమూర్తి భక్తజన హితుడు, ఆదర్శ పురుషుడు, ఆరాధ్యనీయుడు. శ్రీరాముడికి ప్రపంచం మొత్తంమీదా లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నప్పటికీ.. భద్రాచలంలోని సీతా లక్ష్మణ సమేత రామాలయం మాత్రం ప్రసిద్ధి చెందింది. రామ భక్తుడైన భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో కట్టించాడు.