భూమిమీది ప్రతి జీవికీ తిండిని ప్రసాదించే దేవత అన్నపూర్ణేశ్వరి. అందుకే ఈ అమ్మవారిని దర్శించి, మనసారా ప్రార్థిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల పార్వతీ అవతారమైన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలోగల హోరనాడు ప్రాంతంలో కొలువై దివ్యశోభతో అలరారుతున్నారు.