అష్టాదశ శక్తి పీఠం... జ్వాలాముఖి క్షేత్రం

Munibabu| Last Modified గురువారం, 9 అక్టోబరు 2008 (16:23 IST)
హిమాలయాల ప్రాంతంలో వెలసిన విశేషమైన శక్తి కల్గిన అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా పిలవబడుతున్నదే జ్వాలాముఖీ క్షేత్రం. అలనాడు పార్వతీ దేవి నాలుక పడిన ప్రదేశంగా భక్తులు విశ్వసించే ఈ ప్రాంతంలో తొమ్మిది జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుండడం విశేషం.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఈ జ్వాలాముఖి క్షేత్రం కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమగల క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు.

జ్వాలాముఖి విశేషాలు
శక్తి పీఠాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో నిత్యం వెలుగుతూ ఉండే జ్యోతులు ఎలా వెలుగుతున్నాయనే అంశం నేటికీ ఓ మిస్టరీనే. ఈ మిస్టరీని తెల్సుకునేందుకు ప్రయత్నించినవారికి ఇది ఓ అంతబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. ఎలాంటి ప్రకృతి విపత్తులకు సైతం ఈ జ్యోతులు ఆరిపోక పోవడం గమనార్హం.

ప్రపంచంలోని ఏ పుణ్యక్షేత్రంలో కూడా ఇలా నిరంతరం వెలిగే జ్యోతులు లేకపోవడం గొప్ప విషయమని స్థానికులు చెబుతారు. జ్వాలాముఖిలో అమ్మవారు జ్వాల రూపంలో ఉండడం వల్ల జ్వాలా దేవి అనే పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇక్కడ కొలువైన శివున్ని ఉన్నత భైరవుడనే పేరుతో పిలుస్తారు.
దీనిపై మరింత చదవండి :