ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో గల గుణదల కొండ మేరీ మాతను దర్శిస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే క్రీస్తు తల్లిగా పిలవబడే మేరీ మాత ఆలయమున్న ఈ ప్రాంతానికి క్రైస్తవులతో పాటు వివిధ మతాలకు చెందినవారు సైతం విచ్చేస్తుంటారు.