ఆళ్వారుల దివ్వ ప్రబంధాలకూ, రామానుజుని శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి పట్టుగొమ్మగా నిలిచిన పవిత్ర వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీరంగం. ఇండియన్ వాటికన్గా పేరు పొందిన ఈ ఆలయం భారతదేశంలోని వైష్ణవ ఆలయాల్లోకెల్లా పెద్దది, సుందరమైనది. శ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైయున్న ఈ దివ్యక్షేత్రం.. తమిళనాడులోని తిరుచ్చికి ఆనుకుని ఉండే ఉభయ కావేరీ నదుల మధ్యన విలసిల్లుతోంది.