కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

పుత్తా యర్రం రెడ్డి|
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరు వినగానే మనకు జ్ఞాపకమొచ్చేది కాలజ్ఞానం. భవిష్యత్తును పాట రూపంలో చెప్పిన ఈయనకు కాలజ్ఞానంపై సినిమాలు కూడా రూపొందిచారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి చెందినవారు. పశువుల కాపరిగానే ఉంటూ తన మహత్తర కంఠస్వరంతో తత్వాన్ని జనానికి భోధించిన యోగి.

ఈయన సమాజంలోని కుల జాఢ్యాన్ని రూపుమాపడానికి కృషి చేశారు. ఈయనకు అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు సిద్దయ్య దూదేకుల కులానికి చెందిన వాడు. మరొక భక్తుడు కక్కయ్య ఇంకొక కులానికి చెందినవాడు ఇలా వివిధ కులాలకు చెందిన వారిని దరిన చేర్చుకుని తన తత్వాన్ని జనంలోకి ప్రచారం చేశారు.

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండంలోని ఆయన పేరిట పెద్ద మఠం ఉంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆయన పేరిటే ఆ మండలం ఏర్పడింది. సంఘసంస్కర్త అయిన ఆయన తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం.

కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యారు. వీరబ్రహ్మంగారి వలనే కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. కర్ణాటక, తమిళనాడులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడకు వెళ్ళడానికి మైదుకూరను నుంచి బస్సుసౌకర్యం ఉంది.దీనిపై మరింత చదవండి :