కోరిన భక్తులకు కొంగు బంగారం పెంచలకోన స్వామి

పుత్తా యర్రం రెడ్డి|
అది రెండు జిల్లాల సరిహద్దు ప్రాంతం. పూర్తిగా అటవీ ప్రాంతం. అయినా సరే ఎటు చూసిన భక్త జనం కిటికిటలాడుతుంటారు. మొక్కు తీర్చుకోవడానికి బారులు తీరి వస్తుంటారు. కోరిన భక్తులకు అక్కడి స్వామి నిజంగా కొంగుబంగారమే. ఆయనే లక్ష్మి నరసింహస్వామి. ఆయన ఉన్న స్థలమే పెంచలకోన

ఈ దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక్కడకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి భక్తులు వస్తుంటారు. ఆయన దర్శనం చేసుకుని అక్కడే బసచేసి వెళ్ళతారు. ఈ ప్రాంతం భక్తి పారవశ్యాలకే కాకుండా సుందరదృశ్యాలకు పెట్టింది పేరు. ప్రశాంతత కోసం నరసింహస్వామి ఈ ప్రాంతాన్ని చేరుకుని స్థిరపడ్డట్లు పురాణాలు చెపుతున్నాయి.

ప్రదేశం : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా రాపూరు నియోజకవర్గంలోని పెంచలకోన. జిల్లా కేంద్రమైన నెల్లూరుకు దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉంది.

ప్రత్యేకత : శ్రీ మహా విష్ణవు అవతారాలలో ఒకటైన లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ వెలిసి ఉన్నాడు. పైగా చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాలు అందమై దృశ్యాలు కనిపిస్తాయి.

ప్రయాణం : నెల్లూరు నుంచి ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ బస్సు సౌకర్యం ఉంది. అదే స్థాయిలో కడప జిల్లా రాజంపేట నుంచి బస్సులున్నాయి.


దీనిపై మరింత చదవండి :