అభివృద్ధికి ఆమడదూరంగా ఉన్నట్లు అనిపించినా చారిత్రాత్మకంగా పేరున్న రాష్ట్రం ఒరిస్సా. ఆలయాలకు ప్రసిద్ధమైన ఒరిస్సాలో గోల్డెన్ ట్రయాంగిల్‌గా పేరుగాంచిన పూరి-కోణార్క్-భువనేశ్వర్ ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన పుణ్య స్థలాలు అంటే అతిశయోక్తి కాదు. ఓ వైపు పూరీ జగన్నాధుడు, మరోవైపు కోణార్క్ సూర్యదేవుడు, భువనేశ్వర్ రాజరాణి, ఆసియాలోనే అతిపెద్ద చిలక సరస్సు.. ఇలా ఒకటేమిటి ఎన్నో చారిత్రక అద్భుతాలను ఎంతో ఆప్యాయంగా పొదువుకున్న సుందర ప్రదేశం ఒరిస్సాను అలా పరికించి చూద్దామా..?!