త్రిస్సూర్ పండుగలో గజరాజుల వైభవం

Elephant
WD
గజరాజులు కొలువుదీరి కనువిందు చేసే ఏకైక ప్రదేశం కేరళలోని త్రిస్సూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఇటీవల కేరళ నూతన సంవత్సరం మేదమ్ సందర్భంగా ఏనుగుల ప్రదర్శన అత్యంత వైభవంగా జరిగింది. అత్యంత వైభవంగా పురమ్ పేరన కేరళ ప్రజలు జరుపుకునే ఈ పండుగనాడు ఏనుగులకు అందమైన అలంకరణలు చేశారు.

మలయాళీ నూతన సంవత్సరం మేదమ్ నాడు వడక్కునాధన్ ఆలయం వెలుపల నిర్వహించే పూరమ్ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ఏనుగులను అందంగా అలంకరించి మేళతాళాలతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం తొలి సంధ్య వేళల్లో ప్రారంభమై మరుసటి రోజువరకూ సాగుతుంది.

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified గురువారం, 17 ఏప్రియల్ 2008 (16:54 IST)
ప్రతి గ్రూపులోనూ కనీసం పదిహేనుదాకా ఏనుగులు ఉంటాయి. ప్రతి గ్రూపు తమతమ ఏనుగుల ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తారు. మొత్తం మీద అత్యంత వైభవంగా ఈ ఉత్సవం జరుగుతుంది. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్న కేరళ ప్రజలు తమ తమ పండుగలలో ఏనుగుల ప్రదర్శనకు తావు లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్వహించరంటే నమ్మి తీరాల్సిందే మరి.


దీనిపై మరింత చదవండి :