దక్షిణ కాశి పంఢర్‌పూర్

Pavan Kumar| Last Modified సోమవారం, 9 జూన్ 2008 (16:32 IST)
మహారాష్ట్రలోని పంఢర్‌పూర్‌ను దక్షిణ కాశీగా హిందువులు పేర్కొంటారు. ఆ రాష్ట్ర వాసులు తమ కులదైవంగా శ్రీ విఠలా-రుణ్మికీ అమ్మవారిని కొలుస్తారు. భక్తి ఉద్యమంలో తమ వంతు పాత్ర పోషించిన సంత్ తుకారం, సంత్ నామదేవుడు, సంత్ పురంధర్ దాసు, ఛిక్లా మేలా, జానాబాయిలు విఠలుడిని కొలిచారు.

మహారాష్ట్రలో చంద్రభాగ నదిగా పిలిచే భీమరథి నది ఒడ్డున ఉంది పంఢర్‌పూర్. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తలు లక్షలాది సంఖ్యలో విఠలుడి దర్శనార్ధం ప్రతి ఏడాది వస్తారు. పంఢరిపురానికి మరో పేరు పుండలిక. విఠలుని దేవాలయం అతిపెద్దది. దేవాలయానికి ఆరు ద్వారాలు ఉన్నాయి. తూర్పున ఉన్న ద్వారాన్ని నామదేవ్ ద్వారంగా పిలుస్తారు.

పంఢరినాథుడి దేవాలయం 5వ శతాబ్దానికి ముందుందని అంటారు. రాష్ట్రకూటులకు చెందిన రాగి ఫలకాలపై ఈ దేవాలయానికి సంబంధించిన సమాచారం ఉంది.
స్థానిక దేవాలయంలో పదస్పర్శ దర్శనంను ప్రత్యేక ఉత్సవంలా జరుపుతారు. ఈ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు దేవాలయానికి వస్తారు. ఆషాడ, కార్తీక ఏకాదశి రోజుల్లో విఠలా-రుక్మిణిలను పల్లకీలో ఉంచి ఊరేగింపు జరుపుతారు. వీటితో పాటుగా రోజూ అనేక కార్యక్రమాలు జరుపుతారు.


దీనిపై మరింత చదవండి :