నిత్యం ఓం నమ: శివాయ అంటూ శివ నామస్మరణతో ప్రతిధ్వనించే పవిత్ర ధామం ద్రాక్షారామం. కాశీకి సమానమైన క్షేత్రమే ద్రాక్షారామమని సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షితో అన్నట్లు పురాణేతిహాసాల్లో చెప్పబడింది. అందుకే దక్షిణ కాశీగా.. అఖిలాండకోటి భక్తుల కల్పతరువుగా... అలరారుతోంది ద్రాక్షారామ భీమేశ్వరాలయం. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన శైవ క్షేత్రాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటున్న ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వరుడు స్వయంభువు...