పల్నాటి పౌరుషానికి సజీవ సాక్ష్యంగా.. మలిదేవరాజు ఆస్థాన మంత్రి బ్రహ్మనాయుడిచే పునర్నిర్మించబడ్డ మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. పల్నాడు ప్రజల పాలిట మణిహారంలాగా వెలసిన ఈ ఆలయం చారిత్రికంగా ఎంతో ప్రసిద్ధి చెందినది కూడా..! త్రేతాయుగంలో ఈ ఆలయం వెలసిన ప్రాంతమంతా దండకారణ్యంలా ఉండేదట. పూర్వకాలంలో కార్తవీర్యార్జుని వంశీకులు నిర్మించిన ఈ ఆలయాన్ని బ్రహ్మనాయుడు 13వ శతాబ్దంలో పున్నర్నించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి...