ప్రశాంతతకు చిహ్నం "శ్రావణ బెళగొళ"

FILE

చంద్రగిరి, ఇంద్రగిరి అనే రెండు కొండల నడుమ ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన సరోవరమే "బెళగొళ". ఇక్కడే అపర బలశాలి, సర్వసంగ పరిత్యాగి అయిన "బాహుబలి" నిలువెత్తు విగ్రహం నెలవై ఉంటుంది. భాషలో "బెళ్ళి" అంటే తెల్లని అని, "గొళ" అంటే నీటి గుండం అని అర్థం. జైనుల సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని విడచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజ్యులైన వారిని శ్రమణులు అని అంటారు.

అలాంటి శ్రమణులు చాలామంది ధ్యానంలో వారి శేషజీవితాన్ని గడిపి నిర్వాణం పొందేందుకు బెళగొళ పరిసర ప్రాంతాలలో నివసించేవారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను "శ్రమణ బెళగొళ" అనేవారు. అదే క్రమంగా "శ్రావణ బెళగొళ" వాడుకలోకి వచ్చింది. అయితే స్థానికులు మాత్రం బెళగొళ అనే పిలుస్తారు.

ఇక్కడ నెలవైన 58 అడుగుల "గోమఠేశ్వరుని" విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకీ పెద్దది. క్రీ.శ. 983వ సంవత్సరంలో "చాముండరాయ" అనే మంత్రి ఈ విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనినే గోమఠేశ్వర ఆలయంగా పిలుస్తుంటారు.
మహామస్తకాభిషేకం ప్రత్యేకం
  12 ఏళ్లకు ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా గోమఠేశ్వరుడికి క్యాన్లకొద్దీ తేనె, పెరుగు, అన్నం, కొబ్బరిపాలు, నెయ్యి, చక్కెర, బాదంపప్పు, కుంకుమపువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూట్స్...లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో పన్నెండు...      


"బాహుబలి"గా పిలువబడే గోమఠేశ్వరుని విగ్రహం చెక్కడంలో శిల్పి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూసి తరించాల్సిందేగానీ, మాటల్లో వర్ణించలేనిది. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వాదానికి అద్దంపట్టేలా ఉంటుంది.

ధ్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు, బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు, వాటిచుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా తీర్చిదిద్దారు. మనం గనుక బాహుబలి విగ్రహం వద్ద నిలబడితే, ఆయన పాదం ఎత్తుకు సరిపోతాం.

కొండమీద నెలవైన ఈ ఆలయం ఎక్కువ ఎత్తులో లేకపోయినా, ఎక్కడం మాత్రం కాస్తంత కష్టంగానే ఉంటుంది. మొత్తంమీద ఓ ఇరవై నిమిషాలు ఎక్కితే స్వామివారిని చేరుకుంటాం. ఆ ప్రాంతంలో బాహుబలి తరువాత చూడాల్సిన ఇతర ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే.

Ganesh|
అలాంటి జైన తీర్థంకరుల ఆలయాల్లో... చంద్రగిరి పర్వతంమీద అశోకుడు నిర్మించినట్లు చెప్పబడే "చంద్రగుప్త బస్తీ" ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్ స్టోన్స్ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు.


దీనిపై మరింత చదవండి :