బీహార్‌లో ప్రాచీన ఆలయ పునరుద్ధరణ

Trishulam
WD PhotoWD
బీహార్‌, వైష్ణో దేవీ ఆలయాల్లోని అతి పురాతన దేవాలయాల్లో కైమూర్ జిల్లాలోని ముండేశ్వరి పుణ్యక్షేత్రం ప్రసిద్ధమైనది. సుమారు 1900 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయం 608 అడుగుల ఎత్తుగల కొండపై ఉంది.

అతి ప్రాచీన కట్టడమైన ఈ ఆలయానికి సంబంధించి జీర్ణోద్ధరణ కార్యక్రమాలను నలందా విశ్వవిద్యాలయం, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఆధ్యాత్మిక ట్రస్ట్ బోర్డ్ పరిపాలనాధికారి ఆచార్య కిషోర్ కునాల్ వెల్లడించారు. ఈ ఆలయం క్రీ.శ 108 సంవత్సరంలో కట్టబడిందని వివరించారు.

గుప్తుల కాలం నుంచే ఈ ఆలయం విశిష్టంగా పూజలందుకుంటోందని వెల్లడించారు. వారి కాలంలోనే ఈ ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాలు, ప్రతిమలు, చిత్ర పటాలు.. ఆవిష్కరింపబడ్డాయని..ఇవి ఆలయ ప్రాశస్త్యానికి మరింత వన్నెతెచ్చేవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

ఈ దేవాలయంలో ఉన్న శిలాఫలకంపై రెండు శాసనాలు బ్రాహ్మీ లిపిలో ఉన్నాయని తెలిపారు. ఈ శాసనాల ద్వారా దేవాలయం గుప్తుల కాలం నాటి కంటే ముందే నిర్మించబడినట్లు పురావస్తు శాఖ నిపుణులు, చరిత్రకారులు పేర్కొంటున్నారు.

Hanumantha Reddy|
అంతేకాకుండా ఈ ఆలయంలో నాలుగు ముఖాలు గల శివుని విగ్రహం ఉందని.. ఈ ప్రతిమకు భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ ప్రతిమ కూడా అత్యంత పురాతనమైనదన్నారు.


దీనిపై మరింత చదవండి :