సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.