మీనాక్షి అమ్మవారి దర్శనం... పుణ్యప్రదం

Madhura Meenakshni Temple
WD PhotoWD
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని రెండో అతి పెద్ద నగరమైన మదురైలో వెలసి ఉంది. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది.

ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు చెప్పబడింది. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు.


ఈ ఆలయంలో పార్వతీ దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకు ప్రవేశం లేదు. కాంస్యం, నల్లరాతితో సర్వాంగ సుందరంగా మలచిన ఆర్ట్ గ్యాలరీ వీక్షకులకు కనువిందు చేస్తుంది. కులశేఖర పాండ్యుని కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమలై నాయక్ హయాంలో ఆధునికీకరణకు నోచుకుంది.

Hanumantha Reddy| Last Modified శనివారం, 5 జనవరి 2008 (17:45 IST)
ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.


దీనిపై మరింత చదవండి :