మధ్యప్రదేశ్ భోజ్‌పూర్‌లోని అతి పురాతనమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని స్వామిని సోమనాథునిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం ఎత్తైన వేదికపై నిర్మించబడింది. 32.25 మీటర్ల పొడవుతో, 23.50 వెడల్పుతో కనిపించే ఈ ఆలయం ఎత్తు ఐదు మీటర్లు. భోజ్‌పూర్ గ్రామం మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన భోపాల్ నుంచి దక్షిణంగా ఇటార్సీ వైపు వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది.