రావణుడు పరమశివుడు ప్రసాదించిన ఆత్మలింగంపై నున్న వస్త్రాన్ని విసిరివేయగా, ఆ వస్త్రం పడిన ప్రాంతమే మురుడేశ్వరగా అవతరించింది. ఈ మురుడేశ్వర కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోగల భట్కల్ తాలూకాలో ఒక పట్టణం. శివుడి పుణ్యక్షేత్రమైన ఈ పట్టణం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుడి విగ్రహం కొలువైయున్న ఈ పట్టణంలో పరమశివుడు మురుడేశ్వరుడుగా నిత్యపూజలందుకుంటున్నాడు.