షిర్డీ ఒకప్పుడు చిన్న గ్రామం. సాయివల్లే ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి కాలేదు. కేవలం టూరిజం వల్లనే ఏదైనా అభివృద్ధి జరిగింది. షిర్డీలో 425 హోటళ్లున్నాయని మాతోటి వచ్చిన సూపర్వైజర్ చెప్పాడు. చుట్టుపక్కల స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి. కానీ రోడ్లు బాగోలేదు.. వాటిని బాగు చేయవచ్చుగదా.. అంటే... ఈ వీధిలో రోడ్డు బాగు చేయాలంటే.. రెండు లక్షలు ఖర్చవుతుంది. దానికి సగం మున్సిపాలిటీ పెట్టుకుంటుంది. మిగిలింది పెట్టుకుంటే రోడ్డు పడుతుంది. కానీ అది ఎవరు ఇవ్వాలనేది ప్రశ్న. అందుకే ఎవరికివారు మాకెందులే అని వదిలేశారు... అంటూ వివరించాడు.