కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహా పురుషులవుతారు అన్నది నాటి మాట. మనిషి తలచుకుంటే ఈ సృష్టికే ప్రతిసృష్టి చేయగలడు అనేది నేటి మాట. చాలా సందర్భాల్లో ఈ విషయం తేటతెల్లమైనప్పటికీ... కుందా సత్యనారాయణ కళాధామం దర్శించినట్లయితే, ఈ మాట ఎంత అక్షర సత్యమో మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది.