దక్షయజ్ఞం సమయంలో అవమాన భారాన్ని భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకున్న శంకరుడు రుద్రమూర్తియై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శంకరుడి తాండవం వేగానికి తట్టుకోలేని సతీదేవి శరీర భాగాలు 52 ప్రదేశాలలో పడి అవి ప్రసిద్ధ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి. అలా సతీదేవి కుడికాలి బొటనవ్రేలు భాగం పడిన ప్రదేశమే కాళీఘాట్.