స్వర్ణదేవాలయం : అమృత్‌సర్

Gulzar Ghouse|
అమృత్‌సర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..... 16వ శతాబ్దంలో నాల్గవ గురువు రామ్‌దాస్ ఒక చెరువు ఒడ్డున డేరా వేశారు. అందులోనున్న నీరు చాలా శక్తివంతమైనది. ఆ కారణంగానే అమృత్‌సర్(అమృత్+సర్) అంటే అమృతం యొక్క సరోవరం అని అర్థం.

గురు రామ్‌దాస్ కుమారుడు ఆ సరోవరం మధ్యలోనే ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్ని స్వర్ణదేవాలయంగా నేడు పిలుస్తున్నారు. ఈ పట్టణంలో ప్రతి ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చే బైసాఖి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ప్రముఖ పర్యాటక కేంద్రం : స్వర్ణదేవాలయం

స్వర్ణదేవాలయం : ఇది సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. దీనిని వారు విష్ణు ఆలయంగాకూడా పిలుస్తారు. ఈ ఆలయ గోపురంపై బంగారు ఆకులతో కప్పినట్లు ఉంటుంది. ఆ ఆకులు భూమి వైపు వంగినట్లుంటాయి. దీని అర్థం ఏంటంటే సిక్కులు ప్రపంచంలోనున్న సమస్యలపట్ల జాగరూకతతో ఉండాలి.

దుర్గియానా ఆలయం : ఇది హిందువుల పుణ్యక్షేత్రం, ఈ ఆలయ గోపురంపై బంగారు, వెండి తాపడాలు కలిగి ఉంటాయి.

జలియాన్ వాలా బాగ్ : 1919వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ స్థానంలో దాదాపు 2000మంది భారతీయులను కాల్చి చంపారు. ప్రస్తుతం ఇక్కడ ఆ సంఘటనకు సాక్షిగా ఈ పార్కు వుంది. బాగ్ అంటే ఉపవనం(తోట).ఈ తోటలో ఆంగ్లేయులను వారిదేశానికి తరిమి కొట్టడానికి బైసాఖి పండుగ సందర్భంగా అందరూ సమావేశమై మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆంగ్లేయాధికారులు జనరల్ డైయ్యర్ తన సైన్యంతో వచ్చి సభలోనున్న చిన్న-పెద్ద, తేడా లేకుండా విచక్షణా రహితంగా కాల్పులు జరిపించారు. వారికి గుర్తుగా ఆ పార్క్‌ను వదిలిపెట్టారు.

బాబా అటల్ రాయ్ స్తంభం : ఇది గురు హరగోవింద్ సింగ్ యొక్క తొమ్మిది సంవత్సరాల కుమారుని సమాధి కలిగిన స్థలం.

తరన్ తారన్ : అమృత్‌సర్ నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఈ కొలను ఉంది. ఇందులోనున్న నీటిలో రోగాలను మాయం చేసే గుణం ఉందని అక్కడివారి విశ్వాసం.

రామ తీర్థం : రాముని పుత్రులైన లవ, కుశల జన్మస్థానంగా పిలువబడుతుంది.

** విమానాశ్రయంనుంచి ఈ పట్టణం దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ సమయం 15 నిమిషాలలో పడుతుంది.
** అక్టోబర్ నుంచి మార్చి నెలవరకు ఈ పట్టణాన్ని సందర్శించవచ్చు.


దీనిపై మరింత చదవండి :