గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By Pavan Kumar

ద్వాదశ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్

WD
శైవ పుణ్యక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ఓంకారేశ్వర్. నర్మదా నదిలో ఒక దీవి ఓంకారేశ్వర్. నర్మదా, కావేరీ నదీ సంగమ ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి వారిని ఓంకార మాంధాతగా పిలుస్తారు. నదిలోని ఈ దీవిలో రెండు కొండల మధ్య ఒక లోయ ప్రాంతం ఉంది. హిందువులు ప్రణవ నాదంగా పిలిచే ఓంను ఈ దీవి తలపిస్తుంది. మధ్య భారతంలో విస్తరించిన వింధ్యా పర్వత శ్రేణి ఈ దీవికి ఉత్తరంగాను, సాత్పూరా పర్వత సానువు దక్షిణంగాను ఉంది.

శ్రీ ఓంకార మాంధాత
శ్రీ ఓంకార మాంధాత దేవాలయం పొడవు ఒక మైలు కాగా, వెడల్పు అరమైలు ప్రాంతంలో విశాలంగా నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణం కోసం ఇక్కడ దొరికే ప్రత్యేక శిలను వినియోగించటం జరిగింది. దేవాలయ శిఖరంపై కూడా అందమైన శిల్పాలను, రూపాలను చెక్కారు.

సిద్ధనాధ్ దేవాలయం
తొలి మధ్యయుగ కాలం నాటి భ్రాహ్మణ వాస్తుకళ నమూనాను తలపించేలా ఈ దేవాలయాన్ని కట్టారు. దేవాలయ రాళ్లపై బయటవైపు ఏనుగులను చెక్కిన తీరు నిజంగా ఒక శోభాయమానం.

శతమాత్రిక దేవాలయం
ఓంకారేశ్వర్‌కు ఆరు కి.మీ. దూరంలో ఈ దేవాలయాల సముదాయం ఉంది. పదో దశాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి.

వసతి
ఓంకారేశ్వర్‌లో మధ్య ప్రదేశ్ పర్యాటక శాఖతో పాటుగా ఇతర హోటెళ్లు, దేవాలయ సత్రాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి?
విమాన మార్గం : సమీపంలో విమానాశ్రయం ఇండోర్ (77 కి.మీ.) లో ఉంది.
రైలు మార్గం : రత్లాం-ఖాండ్వా మీటర్ గేజి మార్గంలో ఓంకారేశ్వర్ రోడ్ స్టేషన్ ఉంది. ఇది ఓంకారేశ్వర్‌కు 12 కి.మీ. దూరంలో ఉంది.
రహదారి మార్గం : ఇండోర్, ఉజ్జయని, ఖాండ్వాల నుంచి ఓంకారేశ్వర్ రోడ్ బస్సులు నేరుగా ఉన్నాయి.

అనువైన సమయం
సందర్శనకు అనువైన సమయం అక్టోబరు-మార్చిల మధ్య వెళ్లాలి.