మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. పుణ్య క్షేత్రాలు
Written By PNR

శ్రీ నవ నరసింహ దేవాలయం, అహోబిలం

దేవాలయం నెలకొన్న ప్రాంతం :
నంధ్యాల (కర్నూలు జిల్లా) నుంచి 74 కి.మీల దూరంలోనూ, తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలోనూ అలాగే హైదరాబాద్ నుంచి 365 కి.మీల దూరంలో అహోబిల పుణ్యక్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రవాణాసౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. కడప, నంధ్యాల మరియు బనగానపల్లి బస్సులు విరివిగా ఉన్నాయి.

ఈ అహోబిల్ పుణ్యక్షేత్రానికి "సింగవేల్ కుండ్రం" అను పేరు కూడా కలదు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా ఉంది.

క్షేత్ర ప్రత్యేకతలు:
ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అనబడే రెండు పర్వతాలను ఈ క్షేత్రం కలిగి ఉంది. ఎగువ అహోబిలం చేరుకోవాలంటే దిగువ అహోబిలం నుంచి ఆరు కి.మీల బస్సు ప్రయాణం చేయాలి. ఈ క్షేత్రంలోని దేవుడు తొమ్మిది విగ్రహ రూపాలలో కనిపిస్తాడు. నవగ్రహాల కన్నా నవ నరసింహుని శక్తి అధికమని భక్తుల విశ్వాసం.

పర్వతంలో వెలసిన క్షేత్రంలోని నరసింహస్వామి తొమ్మిది రూపాలలో భక్తుల పూజలందుకుంటాడు.అహోబిల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మలోల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, భావనా నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, ఛత్ర వడ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, జ్వాలానరసింహస్వామిగా స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు.

అహోబిల నరసింహస్వామిని గురించి ఆదిశంకరాచార్య, ఉడయవర్ రామానుజం మరియు శ్రీ మధ్వాచార్యులవారు అత్యద్భుతంగా స్తుతించారని పురాణేతిహాసాలు చెపుతున్నాయి. సర్వమానవ సౌభ్రాతృత్వానికి సకల మానవ కళ్యాణానికి పాటు పడిన పైన పేర్కొన్న ముగ్గురు మహానుభావులతో పాటుగా గరుడాళ్వార్, ప్రహ్లాదాళ్వార్ మరియు తిరుమంగై ఆళ్వార్ అహోబిల నరసింహస్వామిని ప్రస్తుతించిన వారిలో అగ్రగణ్యులు.

ఎగువ అహోబిలం క్రూర మృగాలకు ఆలవాలంగా ఉంటుంది. కనుకనే సరియైన మార్గదర్శకుల ఆధ్వర్యంలో భక్తులు బృందాల వారీగా ఎగువ అహోబిలంకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మధ్యాహ్నానికల్లా భక్తులు ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలంకు తిరిగి రావడం శ్రేయస్కరం.