విదేశాల్లో మామూలే అయినా... ఇండియాలో అమ్మాయిలకు ఇప్పుడిపుడే ఈ మాజీ ప్రేమికుల బెడద ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే మోసపోవడంలో భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిలదే అగ్రస్థానం. ఏదో ఒక వలలో చిక్కి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటారు. ప్రేమించినవాడు మంచివాడనుకుని మనసుతో పాటు అన్నీ అర్పించి చివరకు అయ్యో అనుకోవడం అమ్మాయిలకు మామూలే... చివరకు సంబంధాలు తెంచుకున్నా మాజీ ప్రేమికులు వెంటపడి వేధిస్తారు. అమ్మాయిల పరిస్థితి `ముల్లు - ఆకు'లా మారిపోతోంది. అందుకే మొదటినుంచీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది.