సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు. మహారాణిలా ముందు భోగిని (భోగి పండుగ), వెనుక కనుమ (కనుమపండుగ)ను వెంటేసుకుని, చెలికత్తెల మధ్య రాకుమార్తెలా సంక్రాంతి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మకరసంక్రాంతి పుణ్యదినాన దానధర్మాలు చేయడం...