సినీతారల సంక్రాంతి ముచ్చట్లు

FILE
రోజులు గడుస్తుంటాయి. పండుగలు వస్తూ పోతుంటాయి. పండుగ పండుగకు వ్యత్యాసముంటుంది. ఒకప్పుడు సరదాగా చేసుకున్న పండుగలు కొన్ని సంవత్సరాల తర్వాత అంత సంబరంగా జరుగకపోవచ్చు. చిన్నప్పుడు జ్ఞాపకాలు పెద్దయ్యాక ఉండకపోవచ్చు. సినిమా నటుల పరిస్థితి కూడా అటువంటిదే...

చిన్నతనంలో భోగి రోజున... గొబ్బిళ్ళు పెట్టుకుని కొత్తబట్టలు కట్టుకుని ఆనందంగా చేసుకున్న రోజులను తలచుకుంటే ఎంతో థ్రిల్‌ కలిగిస్తుందని నటీమణులంటే... అవన్నీ గడచిన కాలమని మరికొంతమంది చెబుతున్నారు. "సం" అంటే సంవత్సరమంతా "క్రాంతి" అంటే జీవితంలో వెలుగులు ఇచ్చే పండుగ అని పలువురు అభివర్ణిస్తున్నారు.

సరే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ... సినీతారలు సంక్రాంతిని ఎలా గడుపుతారో అడిగి తెలుసుకుందామా...?

ఫ్యామిలీతోనే గడుపుతా..తరుణ్
ఈ సంక్రాంతి నాకు మంచి కలిగించింది. ఈ ఏడాది విడుదలైన "శశిరేఖా పరిణయం" విజయంతో నాకు రెండు పండుగలు వచ్చినంత ఆనందంగా ఉంది. కృష్ణవంశీ చిత్రంలో నటించాలన్న కోరిక నెరవేరి అది విజయంగా మారింది. సంక్రాంతి నాడు నేను ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతాను. బంధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. కొత్త సంవత్సరంలో వచ్చే అతి పెద్దపండుగ అది. "నువ్వులేక నేను లేను", "నువ్వేకావాలి", "నువ్వేనువ్వే" చిత్రాల విజయాలు సంక్రాంతి నాడే అనుభవించాను. అలాంటి అనుభవాన్ని ఈ ఏడాది అనుభవిస్తున్నాను.
FILE


సంక్రాంతి రోజున చెరకు తప్పనిసరిగా తింటా: అనుష్క
నాకు పండుగలంటే భలే సరదా. అవకాశం దొరికితే నా చిన్ననాటి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే తప్పనిసరిగా చెరకు రుచి చూడందే ఉండను. చిన్నప్పుడైతే చిన్న చిన్న చెరకు ముక్కలు మాత్రమే ఇచ్చేది మా అమ్మ. ఇప్పుడు మాత్రం చెరకు గడ మొత్తాన్ని తినిపారేస్తాను. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతిని ప్రజల సమక్షంలో జరుపుకోవాలని అనుకుంటున్నానని నటి అనుష్క చెబుతోంది. అంటే.. ఆమె నటించిన "అరుంధతి" చిత్రం సంక్రాంతినాడు విడుదలవుతోంది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేసింది. ఈ చిత్రకథ నాకు బాగా నచ్చింది. దర్శకుడు కోడిరామకృష్ణ అద్భుతంగా తీశారు. నేను తల్లిదండ్రులతో ప్రతి సంక్రాంతిని గడుపుతాను. ఈ ఏడాది కూడా ఆ అవకాశం కల్గింది.

పండుగ అంటే చిన్నతనంలోనే... కృష్ణవంశీ
సంక్రాంతిని ఇంకా జరుపుకుంటున్నారా? అని ప్రశ్నిస్తూ.. ఈ పండుగ పట్టణాల్లో ఏదో చేసుకోవాలి అన్నట్లుగా ఉంటుంది మినహా చిన్నతనంలోనే ఊర్లలో చేసుకున్నంత సరదాగా ఇప్పుడులేదు. భోగినాడు.. చెత్తంతా ఏరుకొచ్చి తెల్లవారుజామున కాల్చేసేవాళ్ళం. అలా చేసి చాలారోజులైంది.

SELVI.M|
ప్రస్తుతం ఏవేవో కొత్తపేర్లతో రకరకాల పండుగలను పట్టణాల్లో చేసుకుంటున్నారు. లవర్స్ డే, ఫాదర్స్‌డే ఇలా జరుపుకోవడం వింతగా ఉంది. అందుకే చక్కని పండుగలను మనసారా జరుపుకోవాలి. నాకు ఈ సంక్రాంతి రెండు విజయాలను సమకూర్చింది. అందులో శశిరేఖా పరిణయం మొదటిదైతే, నంది అవార్డు దక్కడం మరో పండుగ.


దీనిపై మరింత చదవండి :