అండమాన్ దీవులకు అరుదైన యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ జీవావరణ నిధిగా అండమాన్ దీవులను యునెస్కో గుర్తించింది. దీనివల్ల అండమాన్ దీవులలో జీవావరణ పరిరక్షణకు యునెస్కో తనవంతు నిధుల సహకారం అందిస్తుంది. దీంతో ఇలా గుర్తింపు పొందిన ప్రాంతాలు మనదేశంలో మొత్తం తొమ్మిదికి చేరాయి.