అనాదిగా యాత్రికులను ఆకర్షిస్తున్న "డెడ్ సీ"

FILE
వేలాది సంవత్సరాలుగా మధ్యధరా సముద్రపు తీర ప్రాంతాల నుంచి అనేకమంది యాత్రికులను ఆకర్షిస్తున్న ఓ ఉప్పునీటి సరస్సునే మృత సముద్రం (డెడ్ సీ) అని వ్యవహరిస్తున్నారు. ఇది పశ్చిమాన ఇజ్రాయిల్ మరియు వెస్ట్ బ్యాంక్.. తూర్పున జోర్డాన్ దేశాల మధ్యన సముద్ర మట్టానికి 420 మీటర్ల దిగువన ఉంది.

380 మీటర్లు లోతు కలిగిన ఈ మృత సముద్రం... ప్రపంచంలోనే అత్యంత లోతైన ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచింది. అంతేగాకుండా ఇది 33.7శాతం లవణీయతతో ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే జలాశయాలలో ఒకటిగా కూడా పేరుపొందింది. ఈ మృత సముద్రం అంచులు భూతలంపై ఉండే పొడి భూములన్నింటికంటే దిగువన నెలకొని ఉంటుంది.

జోర్డాన్ లోయలో ఏర్పడిన ఈ మృత సముద్రం 67 కిలోమీటర్ల పొడవు, అత్యంత వెడల్పైన ప్రదేశంలో 18 కిలోమీటర్ల వెడల్పు మేరకు విస్తరించి ఉన్నది. దీని ప్రధాన నీటివనరు జోర్డాన్ నది. అత్యంత లవణీయత కలిగిన ఈ సరస్సు, వాండా సరస్సు సముద్రం కంటే 8.6 రెట్లు అధిక లవణీయత కలిగి ఉన్నది. దీంతో.. అత్యధికమైన లవణీయత కలిగిన ఈ మృత సముద్రం జంతుజాలం మనుగడకు అత్యంత కఠోరమైన ఆవరణంగా తయారైంది.

అస్సల్ సరస్సు (జిబూబీ), గరబొగజ్కోల్ మరియు అంటార్కిటికాలోని మెక్‌ముర్డో పొడి లోయలలోని లవణీయత ఎక్కువైన డాన్ హువాన్ కుంట వంటి కొన్ని సరస్సులు మాత్రమే మృతసముద్రాని కంటే ఉప్పగా ఉంటాయి. ఇది మధ్యధరా సముద్రం కంటే (34% శాతంతో మధ్యధరా సముద్రం యొక్క 3.5% శాతంతో పోల్చినపుడు) పది రెట్లు ఉప్పగా ఉన్నదని నిపుణుల అంచనా.

Ganesh|
బైబిల్ కథనం ప్రకారం... దావీదు రాజు ఈ మృత సముద్రం వద్దనే తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇది హేరోదు పాలనాకాలంలో ప్రపంచంలోనే మొట్టమొదటి హెల్త్ రెసార్ట్‌గా పేరుతెచ్చుకున్నది. ఈజిప్టు ప్రజలు మమ్మీలను భద్రపరచడానికి ఉపయోగించిన లేపనాల నుండి ఎరువులలో వాడే పొటాష్ వరకు అనేక రకాల ఉత్పత్తులను ఈ మృత సముద్రం సరఫరా చేసింది. అప్పట్లో... మృత సముద్రం నుండి లభ్యమయ్యే లవణాలు మరియు ఖనిజాలు సౌందర్యసాధనాలు తయారుచేయటానికి ప్రజలు ఉపయోగించేవారు.


దీనిపై మరింత చదవండి :