అందమైన ప్రకృతిని కొంగున ముడి వేసుకున్న ఈ ప్రాంతంలో తెల్లవారుఝాము 5 గంటలకల్లా తెలతెలవారుతుంటుంది. అలాగే సాయంత్రం 5 గంటలకల్లా చీకటి పడిపోతుంటుంది. ఈ ప్రాంతం పేరే అండమాన్. మన స్వాతంత్ర్య సమరయోధులు చెరసాలల్లో మగ్గిపోయింది ఈ ద్వీపంలోనే. సముద్రాన్ని నిలువెల్లా తాగేయాలనీ, ఆకాశాన్నంతటినీ గుప్పిట్లో బంధించేయాలని, ప్రకృతి ఒడిలో ఆదమరచి సేదతీరాలని భావించే ప్రకృతి ప్రేమికులు తప్పకుండా చూడాల్సిన ప్రదేశమే అందాల అండమాన్.