కంగారూల "పగడాల దీవి"లో వాలిపోదామా...?!

Fish
Ganesh|
FILE
చుట్టూ గంభీరమైన సముద్రం, కాల ప్రవాహంతో తమకేమీ సంబంధం లేదన్నట్లుగా ఉండే పర్వత శ్రేణులూ, కమ్మటి వాసనలతో మత్తెక్కించే యూకలిప్టస్ చెట్లూ, వాటి కొమ్మల్ని కరచుకుని నిద్రపోతూ ముద్దొచ్చే పక్షులు, భూదేవి నొసటన ఎర్రటి కుంకుమలా ఉండే ఇసుక, గాలి చప్పుడు తప్పిస్తే ఏ విధమైన సవ్వడీ లేని నిశ్శబ్దం.... వెరసీ ఆస్ట్రేలియా ఖండం.

సాధారణంగా ప్రకృతి అందమంతా గలగలా పారే నదుల్లోనూ, పచ్చని పంటపొలాల్లోనూ ఉందని అనుకుంటుంటాం. కానీ ఇక్కడేముంది ఉత్త ఎడారి ప్రాంతం తప్ప అని చాలాసార్లు అనాసక్తిని ప్రదర్శిస్తాం. కానీ ఆస్ట్రేలియా ఖండాన్ని చూసిన తరువాత... ఎవరో చిత్రకారుడు ప్రశాంతమైన మనసుతో కుదురుగా కూర్చుని గీసిన బొమ్మంత ఎర్రగా, అందంగా ఉంది కదూ.. అనిపిస్తుంది. ఇంతటి అందాలను తనలో దాచుకున్న ఆస్ట్రేలియా ఖండంలో చూడదగ్గ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..!

గ్రేట్ బారియర్ రీఫ్...
ఆస్ట్రేలియా ఖండంలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రపంచంలోకెల్లా పెద్దదైన ఈ "పగడాల దిబ్బ" గురించే. భూమికి చాలా ఎత్తు నుంచి కూడా ఇది కనిపిస్తుందని చెబుతుంటారు. ఇందులో దాదాపు మూడు వేల చిన్న చిన్న పగడాల దిబ్బలు (కోరల్ రీఫ్‌లు) ఉన్నాయి. ఈ రీఫ్ పొడవు 2,300 కిలోమీటర్లు కాగా.. ఇది ఆస్ట్రేలియాకు ఉత్తర భాగంలో క్వీన్స్‌లాండ్ తీరానికి సమాంతరంగా ఉంటుంది.
లైం స్టోన్ గుహలు.. అద్భుతం..!
ఇక్కడి భూగర్భంలో ఉండే స్టాలక్టైట్, స్టాలగ్మైట్‌లతో నిండిన లైం స్టోన్ గుహలు చాలా అందంగా ఉంటాయి. ఇవి కంగారూ దీవిలోనే కాక ఆస్ట్రేలియా ఖండమంతా కనిపిస్తాయి. మిలియన్ల సంవత్సరాల క్రితం జీవించి మరణించిన జంతుజాలాల ఎముకలలోని కాల్షియంవల్ల ఈ భూగర్భ గుహలు...


బ్రిస్బేన్ నగరానికి దగ్గరగా ఉండే కెయిర్న్స్ అనే చిన్న ఊరు నుంచి జలాంతర్గామిలో సముద్రంలోకి కొంత దూరం ప్రయాణిస్తే ఈ గ్రేట్ బారియర్ రీఫ్‌ని చేరుకోవచ్చు. దాదాపు 2 వేల కంటే ఎక్కువ రకాల చేపలు ఉండే ఈ రీఫ్‌ని చూసిన తరువాత మనకు ఇంకే ఆక్వేరియాన్ని చూడాలంటే మనసు ఒప్పుకోదు. ఆ చేపల రంగులు, వాటి శరీరంపై ఉండే మిలమిలలు, డిజైన్లను కళ్లారా చూడాల్సిందే తప్ప మాటల్లో మాత్రం వర్ణించేందుకు వీలుకాదు.

ప్రపంచంలో ఉండే ఇలాంటి రీఫ్‌లలో ఇరవై శాతం మేరకు ఆస్ట్రేలియా చుట్టూ ఉండే సముద్ర ప్రాంతాలలోనే ఉండటం విశేషంగా చెప్పవచ్చు. కాగా.. 3 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు వ్యాపించి ఉండే గ్రేట్ బారియర్ రీఫ్‌లో చిన్న చిన్న దీవులు ఎన్నో ఉన్నాయి. వాతావరణ కాలుష్యం, సరదా కోసం చేపలు పట్టటం, ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ రీఫ్‌లోని ప్రాణి ప్రపంచం కొంత మేరకు నశించి పోతోంది. అందుకనే ఆస్ట్రేలియా ప్రభుత్వం క్వీన్స్‌లాండ్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతన్నంతటినీ పరిరక్షిత ప్రాంతంగా ప్రకటించి అనేక రక్షణ చర్యలను చేపడుతోంది.

గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు సంపాదించిన ఈ గ్రేట్ బారియర్ రీఫ్‌ను చూసేందుకు ప్రతియేటా దాదాపు 20 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. పర్యాటకుల వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం సమకూరినా.. కొంతవరకు అక్కడ జీవించే జంతుజాలానికి మాత్రం హాని జరుగుతోంది. దాంతో ఈ 1981లో ఈ ప్రాంతాన్ని "వరల్డ్ హెరిటేజ్"గా ప్రకటించారు.

కంగారూ దీవి...
ఇది ఏషియా ఫసిఫిక్ ప్రాంతంలో ఉండే అన్ని దీవుల్లోకెల్లా అందమైనదిగా పేరుగాంచింది. సింగపూర్‌కంటే ఏడురెట్లు పెద్దదైన ఈ కంగారూ దీవి అద్భుతమైన వన్యప్రాణులకు, వృక్షజాతులకు పుట్టినిల్లు. ఇక్కడ వన్యప్రాణులన్నీ జూలోనో, పార్కులోనో బంధించినట్లుగా కాక.. స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. కొవాలా, సీల్సు, ఎకిడ్నా, కంగారూ.. తదితతర జంతుజాలం హాయిగా, సురక్షితంగా ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి.

ఆస్ట్రేలియా తీరానికి కాస్త దూరంలో, సముద్రంలో ఉండే ఈ కంగారూ దీవి.. ఆస్ట్రేలియా చుట్టూ ఉండే చిన్న చిన్న దీవుల్లోగల "టాస్మానియా" దీవికంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. అడిలైడ్ నగరానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే "కేప్ జర్విస్" అనే రేవు నుండి సముద్రంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర ఇది ఉంటుంది. 1802లో మేథ్యూ ప్లిండర్స్ అనే నావికుడొకరు మొట్టమొదటిసారిగా ఈ దీవిని కనుగొని కంగారూ ఐలాండ్ అనే పేరు పెట్టాడని చెబుతుంటారు.


దీనిపై మరింత చదవండి :