కార్తీకమాస స్నానాలు ప్రారంభం... వీడియో చూడండి

Venkateswara Rao. I|
ఏలూరు జిల్లా మొగల్తూరు సముద్ర తీర ప్రాంతం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తుల సందడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డు మార్గాన్ని ఆధునీకరించిన అధికారులు సముద్ర స్నానం ఆచరించే భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం మరిచారు.

స్నానమాచరించిన మహిళలకు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు పుణ్య స్నానాలను ఆచరించేందుకు వచ్చిన భక్తులను సమీప ప్రాంతాలలో ఉన్న మద్యం దుకాణాలు బెంబేలెత్తిస్తున్నాయి.

పూటుగా తాగిన మైకంలో కొందరు సముద్రంలో స్నానం చేయడానికి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే బీచ్ కు వాహనాల్లో వచ్చే సుదూర ప్రయాణికుల వద్ద నుంచి టోల్‌గేట్లు ఏర్పాటు చేసి డబ్బు గుంజుతున్నారు. పండుగలనాడు లక్షల్లో వచ్చే భక్తులకోసం అధికారులు తగిన సౌకర్యాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.


దీనిపై మరింత చదవండి :