గౌతమ బుద్ధుడిని స్త్రీ వేషంలో ఆరాధిస్తారిక్కడ...!

Macau
Ganesh|
FILE
సన్నగా వర్షం పడేటప్పుడు.. ఆకాశం ఇంద్రధనుస్సు రంగులతో హొయలు ఒలికిస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి సముద్రం మీద రయ్‌మంటూ దూసుకెళ్లే క్రూయిజ్‌లలో ప్రయాణించటం ఓ అందమైన అనుభూతి. సముద్రం అంచులమీద కనబడే పచ్చని కొండలూ, ఆ కొండలమీద పేరు తెలియని పూల వృక్షాలూ ప్రకృతి అందాన్నంతా పులుముకుని మరీ మనల్ని స్వాగతిస్తాయి. ఇంతటి అందాలకు, ఆనందాలకు నిలయమే "మకౌ".

మకౌ అనేది చాలా చిన్న దేశం. థాపొ దీవి, యెగో దీవి కలిస్తే మకౌ అవుతుంది. మకౌ‌లు నివసించే దేశం కనుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. మకౌ అంటే "ఏమిటి..?" అని అర్థం అట. ఈ దేశంలో పదిహేను లక్షలమంది మాత్రమే నివసిస్తుంటారు. వారిలో 95 శాతం చైనీయులు, ఫిలిఫ్పైన్స్, పోర్చుగీసు వాళ్లు నివసిస్తుంటారు. ఇక్కడ భారతీయులు కూడా ఉన్నారనీ.. అక్కడి జనాభా లెక్కల ప్రకారం 72 భారతీయ కుటుంబాలు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మకౌ‌లో 40 శాతంమంది బుద్ధిస్టులు, 50 మంది కాథలిక్కులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ పది బుద్ధ దేవాలయాలు, 18 చర్చిలు వెలిశాయి. ఇక్కడి "సింపాల్ చర్చ్" మకౌ దేశానికి గుర్తుగా వాడుతుంటారు. లీ.తీ.దీ (బార్న్ ఇన్ చైనా) ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. చైనా పక్కనే ఈ దేశం ఉంటుంది కాబట్టి.. ఆ దేశ ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది.

చైనాలోని షాంగై నగరం నుంచి క్రూయిజ్‌లలో ప్రయాణిస్తే 70 నిమిషాల వ్యవధిలో మకౌ చేరుకోవచ్చు. మకౌ వెళ్లేందుకు చైనీయులకు వీసా, పాస్‌పోర్టుల్లాంటివి ఏవీ అవసరం లేదుగానీ.. విదేశీ పర్యాటకులు మాత్రం వీసా, పాస్‌పోర్టులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ..!
మకౌ దేశాన్ని "ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే.. ఇక్కడ పగలు ఎలా వాహనాలు తిరుగుతుంటాయో.. రాత్రిళ్లు కూడా అలాగే తిరుగుతుంటాయి. కాసినోవాలు 24 గంటలపాటూ నడచిన అవి రాత్రిళ్లు మరింత వేగంగా పనిచేస్తాయి. చిరుజల్లులు పడే ఆ రాత్రులను...


మకౌ‌ను సందర్శిస్తే "జీవితం అంటే ఏంటి?" అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుందని చాలా మంది పర్యాటకులు, పూర్వీకులు భావిస్తుంటారు. అందుకే ఈ దేశానికి "ఏమిటి..?" అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అయితే నిజంగానే ఇక్కడకు వెళ్లాక అందరికీ జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయించకమానదు. ఎందుకంటే మకౌ పూర్తిగా విలాసవంతమైన దేశం. విలాసవంతుల కోసం వెలసిన దేశం.

ప్రపంచంలోని విలాసవంతులంతా తమ డబ్బును డాలర్ల రూపంలోకి మార్చుకుని విలాసం పొందేందుకు మకౌ చేరుతుంటారు. ఇక్కడ లభ్యంకానిది ఏదీ ఉండదు. మందు, మాంసం, మగువ.. లాంటివన్నీ ఇక్కడ బహిరంగంగా, బేరసారాలతో లభ్యమవుతుంటాయి. ఇక్కడ ఏదీ నిషిద్ధం కాదు. ఎటు చూసినా ప్రపంచంలోని అన్నిరకాల మద్యానికి ఇక్కడ కొదువే ఉండదు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున కాసినోవాలు ఉంటాయి.

ఇక్కడి ప్రతి హోటల్ తనదైన ప్రత్యేక కాసినోవాను కలిగి ఉంటుంది. అంతేగాకుండా రూం కీతో పాటు పర్యాటకులు కాసినోవాలో ఆడేందుకు 50 హాంకాంగ్ డాలర్లను కూడా ఉచితంగా ఇస్తుంటారు. వాటికి మరో 50 హాంకాంగ్ డాలర్స్ కలిపి వంద డాలర్ల కార్డు తీసుకుని ఇక్కడ ఆడవచ్చు. ఈ దేశానికి ప్రధాన ఆర్థిక వనరులు కాసినోవాలో అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు.


దీనిపై మరింత చదవండి :