పన్నులు, సుంకాలు లేని "లంఘావీ"లో వాలిపోదామా...?!

FILE

లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన దీవులు, వాటిపైన సూరీడు, కింద ఎటుచూసినా సముద్రం, ఇసుక... వీటన్నింటి కలబోతే "లంఘావీ". అతి ప్రాచీనమైన 99 దీవుల సముదాయమైన ఈ లంఘావీ దీవి మలేషియాలో ఉంది. ఇది మలయ్, భారత్, చైనా దేశాల నేపథ్యం, వలసల వారసత్వాల సమ్మిళిత సంస్కృతుల సంగమంగా రూపుదిద్దుకుంది.

ఈ లంఘావీ దీవులకు రెండే రెండు రకాల దారులు మాత్రమే ఉంటాయి. ఒకటి సముద్రమార్గం లేదంటే విమాన మార్గం. కేవలం 478 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో సముద్ర రహస్యాల్లాంటి గుహలు, మడచెట్లుతో కూడిన అడవులు ఉన్న దీవుల సముదాయమే ఇది.

అయితే ఈ లంఘావీ దీవుల్లో మలేషియా ప్రజలు మరో కొత్త ప్రపంచాన్నే నిర్మించారు. ఈ ప్రపంచంలో బీచ్‌లు, రిసార్టులు, కాళ్లను తాకి వెనక్కి వెళ్లే అలల మధ్య మెత్తటి ఇసుకలో సేదతీరే తీరాలు, మధ్యలో ఆశ్చర్యంగొల్పేలా మంచినీటి మడుగులు, సముద్రం అలలకు కోసుకుపోయి ఏర్పడిన అంతర్ గుహలు, రాబందులు, గద్దలు, షార్క్ పిల్లలు, ప్రపంచంలోనే ఎత్తయిన ప్రాంతానికి తీసుకెళ్లే కేబుల్ కార్లు... ఇలా ఒకటేమిటో ఎన్నింటికో ప్రాణం పోశారు వారు.
ఎలక్ట్రానిక్స్ వస్తువులు కారుచౌక
  ఇక్కడ మంచినీటి బాటిళ్లకంటే... ఎలక్ట్రానిక్ వస్తువులు, మద్యం, విదేశీ సిగరెట్లు, దుస్తులను కారుచౌకగా కొనవచ్చు. క్కడ నేరాల సంఖ్య శూన్యమనే చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాలు తప్ప చోరీల్లాంటివి ఇక్కడ ఉండనే ఉండవు. ఎందుకంటే నేరాలు చేసినవారు తప్పించుకునే అవకాశం...      


ఎవరయినా సరే... అసలు మరో దారంటూ ఏదీ లేని ఈ ప్రపంచాన్ని మలేషియన్లు ఎలా నిర్మించారబ్బా...! అని ఆశ్చర్యంలో పడిపోవడం మాత్రం ఖాయం. అక్కడి గైడ్‌లను, తెలిసిన వారిని ఇదే విషయం అడిగితే అదంతే.. ఇక్కడ ఉండేది కేవలం 70వేలమంది జనాభా మాత్రమే. ఈ దీవులన్నింటికీ లంఘావీకి మధ్య పడవలు, మరపడవలు, నౌకలు తప్ప వేరే సాధనాలేమీ ఉండవని చెబుతారు.

థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న లంఘావీ దీవిని "జియోపార్కు"గా అభివృద్ధి చేసి, పర్యాటకులకు ఆకర్షణీయ ప్రాంతంగా మలేషియా ప్రభుత్వం తీర్చిదిద్దింది. లండన్, సింగపూర్, కౌలాలంపూర్, పెనాంగ్‌ల నుంచి ఈ ప్రాంతానికి నేరుగా విమానాలు తిరుగుతుంటాయి.

ఈ లంఘావీ దీవిలో మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే... ఇక్కడ పన్నులు, సుంకాలు అనేవి అసలు ఉండక పోవటం. అలాగే మలేషియాలో ధరలు కూడా ఒక పొంతన లేకుండా ఉంటాయి. ఇక్కడ మంచినీటి బాటిళ్లకంటే... ఎలక్ట్రానిక్ వస్తువులు, మద్యం, విదేశీ సిగరెట్లు, దుస్తులను కారుచౌకగా కొనవచ్చు.

లంఘావీ దీవిలో కేబుల్ కార్ ప్రయాణం ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. గ్రౌండ్ నుంచి 700 మీటర్ల ఎత్తుకు ఇనుపతాడుపై ఊగుతూ, తూగుతూ ప్రయాణించి వెళితే పైన రెండు స్టేషన్లు, అక్కడ మళ్లీ రెండు పర్వతశ్రేణుల నడుమ వంతెన కనిపిస్తుంది. ఆ ప్రదేశం నుంచి అండమాన్ సముద్రం మీదుగా థాయ్‌లాండ్‌ను కూడా చూడవచ్చు.

Ganesh|
అలాగే "అండర్ వాటర్ వరల్డ్" కూడా చెప్పుకోదగ్గది. అద్దాల గదుల గుండా నడచివెళ్తుంటే పెద్ద పెద్ద చేపలు తలపైనా, రెండువైపులా కదలివెళ్తుంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ నేరాల సంఖ్య శూన్యమనే చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదాలు తప్ప చోరీల్లాంటివి ఇక్కడ ఉండనే ఉండవు. ఎందుకంటే నేరాలు చేసినవారు తప్పించుకునే అవకాశం అసలు ఉండదు.


దీనిపై మరింత చదవండి :