డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు... ఈ ప్రాంతం కొత్త అందాలను పులుముకుంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గం గుండా ప్రయాణించే పర్యాటకులకు దారి పొడవునా అనేక దృశ్యాలు కన్నులపండుగ చేస్తాయి. సంధ్యవేళల్లో జాలువారే సున్నితపు సూర్యకిరణాలు సృష్టించే అద్భుతాలను నీలాల అఖాతపు సోయగాలతో కలిపి చూసే అదృష్టం వీరికే లభిస్తుంది. ఇంతటి ఆనందాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేదే మహాబలిపురం సముద్ర తీర ప్రాంతం.