స్వచ్ఛమైన నీళ్ళు, చల్లటి గాలి, ఊరించే దృశ్యాల అందాలు, ఆనందాలు... ఇలా వీటన్నింటి కలబోతే మెక్సికోలోని కాన్‌కూన్ ఐలాండ్. ఈ దీవిలో విరిసిన అందాలను చూడాలంటే మన రెండుకళ్ళూ సరిపోవు. ఇక్కడి సకలవర్ణ చేపలు మనకు షేక్‌హ్యాండ్ ఇస్తూ హాయిగా స్వాగతం చెబుతాయి. కాన్‌కూన్ దీవిలో చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాన్‌కూన్ బీచ్‌కి దగ్గర్లోగల షిజెనిట్జా అనే ప్రాంతం. క్రీ.శ. 490వ సంవత్సరంలో కట్టబడిన ఈ కట్టడం ప్రపంచంలోనే గొప్ప ఆర్కలాజికల్ వండర్‌గా గుర్తించారు. ఎవరైనా సరే తప్పకుండా చూసి తరించాల్సిన చారిత్రాత్మక ప్రదేశం ఇది. ఇక్కడి మ్యూజియం అందమైన శిల్పాలకు, హస్తకళలకు నిలయంగా విలసిల్లుతోంది.