ప్రపంచంలోనే ఇవి అత్యంత సుందరమైనవట...!

Beach
Ganesh|
FILE
సాయం సంధ్య వేళల్లో అస్తమించే సూర్యుడిని చూస్తూ.. పట్టుకుంటే సుతారంగా జారిపోయే సముద్రపు ఇసుకతో ఆడుకుంటూ.. కడలి అందాలను కళ్లతో జుర్రుకుంటూ.. అమాంతం చిన్నపిల్లలైపోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవటం తప్పుకాదు. ఎందుకంటే, ఈ అనుభూతి చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే కుటుంబంతో కలిసి ఆనందంగా విహరించే స్థలాల్లో సముద్ర తీరాలకు చాలామంది మొదటి స్థానాన్నిస్తుంటారు.

ఇలాంటి వారి కోసం "లోన్లీ ప్లానెట్స్" అనే సంస్థ "ట్రావెల్ విత్ చిల్డ్రన్స్" అనే పేరుతో పిల్లలతో కలిసి విహరించదగ్గ పది అందమైన బీచ్‌లను ఎంపిక చేశారు. ఆ బీచ్‌లలోని అందాలు, అవి ఏయే ప్రాంతాలలో ఉన్నాయో తదితర వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా...?!

కోస్తా‌డెల్‌సడ్ బీచ్...
ఇటలీలోని కోస్తా డెల్‌సడ్ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు ముఖ్య కారణం.. అక్కడి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉండటంతోపాటు, చాలా స్వచ్ఛమైన నీటితో, తెల్లటి ఇసుకతో మిలమిలా మెరిసిపోతూ ఉంటుంది. ఇటలీ దేశంలోని అన్ని బీచ్‌లకంటే ఇది ఎంతో వైవిద్యభరితంగా ఉండటంవల్లనే అందమైన సముద్ర తీర ప్రాంతాలలో మొదటి స్థానాన్ని ఎగరేసుకుపోయింది.

Beach
FILE
కటోస్లో బీచ్...
పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్ ప్రాంతంలో గల ఈ బీచ్.. అందంగానూ, అత్యంత సురక్షితమైనదిగానూ గుర్తింపు పొందింది. ఎంత సురక్షితం అంటే.. చిన్నపిల్లలు సైతం ఇక్కడి సముద్రంలో మునిగేందుకు చాలా అనువుగా ఉంటుందిక్కడ. ఈ సముద్రం నీటిలో ఉప్పు శాతం కూడా తక్కువగా ఉండటంవల్ల చాలా మంది పర్యాటకులు జలకాలాడేందుకు కూడా ఇష్టపడుతుంటారు.

డర్బన్ బీచ్...
దక్షిణాఫ్రికాలో గల ఈ సముద్ర తీరంలో సాధారణంగా ఉండే వేడికంటే తక్కువగా నీళ్లు చల్లగా, జిల్లుమనిపించేలా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఈత కొట్టేందుకు అనువుగా చాలా ఈత కొలను (స్విమ్మింగ్‌ఫూల్స్)లను కూడా ఈ బీచ్‌లో ఏర్పాటు చేసి ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అందుకే ఈ డర్బన్ బీచ్ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

కరోన్ బీచ్...
కుటుంబ సభ్యులతో, స్నేహితులతో.. సరదాగా, హాయిగా సందర్శించేందుకు అనువుగా ఉండే ఈ సముద్ర తీరం థాయ్‌లాండ్‌ దేశంలో ఉంది. ఇక్కడి సముద్రపు ఒడ్డున ఉండే అనేక పార్కులు పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. అంతేగాకుండా ఇక్కడ సీఫుడ్స్ రెస్టారెంట్లతో కూడిన ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌లు కూడా అనేకం ఉన్నాయి. చాలా సందడిగా ఉంటే ఈ బీచ్‌ను రాత్రిపూట కూడా సందర్శించేందుకు అనేకమంది యాత్రికులు ఆశక్తి చూపిస్తుంటారు.


దీనిపై మరింత చదవండి :