పక్షుల కిలకిలా రావాలు, ఎటువైపు చూసినా కనువిందు చేసే పచ్చదనం, పూల సుగంధ పరిమళాలు కలగలిపిన స్వచ్ఛమైనగాలి, సముద్ర తీరం హొయలు... వీటన్నింటినీ కలగలిపి చెప్పాలంటే వర్ణించటం చాలా కష్టం. అయితే, స్వయంగా ఆస్వాదించాలంటే మాత్రం, మన దేశ పటానికి చివర్లో చిన్న దీవి లాగా కనిపించే దేశమైన శ్రీలంకకు వెళ్ళాల్సిందే మరి..!