అందమైన బీచ్‌లనగానే ఎవరి నోటైనా వచ్చే మాట గోవా. అయితే గోవాకి అతి సమీపంలో గోవా బీచ్‌లకు ఏమాత్రం తీసిపోని బీచ్‌లు కలిగిన ప్రదేశం గోకర్ణం. గోవా క్రైస్తవ నిలయమైతే, గోకర్ణం శైవక్షేత్రం. అందుకే భక్తికి, రక్తికి కూడా పనికొచ్చే పర్యాటక ప్రదేశంగా దీనిని పేర్కొంటారు. శైవులు తొలిసారిగా ప్రార్థనలకోసం ఎంచుకున్న ప్రదేశం గోకర్ణం. ఇది పవిత్ర పుణ్యక్షేత్రం.ప్రసిద్ధి చెందిన శైవ మందిరం ఇక్కడ ఉంది. గోకర్ణం సముద్రతీర ప్రదేశం. ఇక్కడ అనేక బీచ్‌లున్నాయి. వీటిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఓమ్ బీచ్. మిగిలిన బీచ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ ఓమ్ బీచ్‌కి చేరేందుకు ప్రత్యేక రవాణా సౌకర్యం అవసరం. బెంగళూరు, మైసూరు, మంగుళూరు వంటివన్నీ కర్ణాటకలో ఐటీ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అక్కడ పనిచేస్తున్న యువత తమ వారాంతపు విశ్రాంతికి ఎంచుకుంటున్న ప్రదేశం గోకర్ణం.