అందమైన బీచ్‌లు, కోనసీమను తలదన్నే కొబ్బరితోటలు, రొమాంటిక్ హాలీడే స్పాట్‌లు, జీడిపప్పు, డ్రింక్ ఫెన్నీలు, కొబ్బరి తోటల నడుమ అక్కడక్కడా విసిరేసినట్లుగా ఉండే రంగు రంగుల ఇళ్లు... వీటన్నింటినీ కలగలిపి చూస్తే, అదే సుందరమైన గోవా ప్రాంతం. ఇక్కడ ఆనందానికి పగలూ, రేయీ తేడా అనేది అసలే ఉండదు. గోవాలో క్రూయిజ్ ప్రయాణం. ఇది ఎవరికయినా ఓ మర్చిపోలేని అనుభవాన్నిందనడంలో సందేహం లేదు. అరేబియన్ సముద్రం, మాండవి నదిపై క్రూయిజ్‌లలో ప్రయాణం చేస్తూ... క్రూయిజ్ డెక్ పైన గోవా పాటలకు అనుగుణంగా ఎంచక్కా డాన్సులు వేస్తూ వెళ్ళవచ్చు. గంటన్నరపాటు సాగే ఈ ప్రయాణంలో పెద్దలంతా చిన్నపిల్లలయిపోవడం ఖాయం.