గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By Ganesh

గౌతమ బుద్ధుడిని స్త్రీ వేషంలో ఆరాధిస్తారిక్కడ...!

FILE
సన్నగా వర్షం పడేటప్పుడు.. ఆకాశం ఇంద్రధనుస్సు రంగులతో హొయలు ఒలికిస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి సముద్రం మీద రయ్‌మంటూ దూసుకెళ్లే క్రూయిజ్‌లలో ప్రయాణించటం ఓ అందమైన అనుభూతి. సముద్రం అంచులమీద కనబడే పచ్చని కొండలూ, ఆ కొండలమీద పేరు తెలియని పూల వృక్షాలూ ప్రకృతి అందాన్నంతా పులుముకుని మరీ మనల్ని స్వాగతిస్తాయి. ఇంతటి అందాలకు, ఆనందాలకు నిలయమే "మకౌ".

మకౌ అనేది చాలా చిన్న దేశం. థాపొ దీవి, యెగో దీవి కలిస్తే మకౌ అవుతుంది. మకౌ‌లు నివసించే దేశం కనుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. మకౌ అంటే "ఏమిటి..?" అని అర్థం అట. ఈ దేశంలో పదిహేను లక్షలమంది మాత్రమే నివసిస్తుంటారు. వారిలో 95 శాతం చైనీయులు, ఫిలిఫ్పైన్స్, పోర్చుగీసు వాళ్లు నివసిస్తుంటారు. ఇక్కడ భారతీయులు కూడా ఉన్నారనీ.. అక్కడి జనాభా లెక్కల ప్రకారం 72 భారతీయ కుటుంబాలు నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మకౌ‌లో 40 శాతంమంది బుద్ధిస్టులు, 50 మంది కాథలిక్కులు ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఇక్కడ పది బుద్ధ దేవాలయాలు, 18 చర్చిలు వెలిశాయి. ఇక్కడి "సింపాల్ చర్చ్" మకౌ దేశానికి గుర్తుగా వాడుతుంటారు. లీ.తీ.దీ (బార్న్ ఇన్ చైనా) ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. చైనా పక్కనే ఈ దేశం ఉంటుంది కాబట్టి.. ఆ దేశ ప్రభావం దీనిపై ఎక్కువగా ఉంటుంది.

చైనాలోని షాంగై నగరం నుంచి క్రూయిజ్‌లలో ప్రయాణిస్తే 70 నిమిషాల వ్యవధిలో మకౌ చేరుకోవచ్చు. మకౌ వెళ్లేందుకు చైనీయులకు వీసా, పాస్‌పోర్టుల్లాంటివి ఏవీ అవసరం లేదుగానీ.. విదేశీ పర్యాటకులు మాత్రం వీసా, పాస్‌పోర్టులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ..!
మకౌ దేశాన్ని "ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే.. ఇక్కడ పగలు ఎలా వాహనాలు తిరుగుతుంటాయో.. రాత్రిళ్లు కూడా అలాగే తిరుగుతుంటాయి. కాసినోవాలు 24 గంటలపాటూ నడచిన అవి రాత్రిళ్లు మరింత వేగంగా పనిచేస్తాయి. చిరుజల్లులు పడే ఆ రాత్రులను...


మకౌ‌ను సందర్శిస్తే "జీవితం అంటే ఏంటి?" అనే ప్రశ్నకు సమాధానం లభిస్తుందని చాలా మంది పర్యాటకులు, పూర్వీకులు భావిస్తుంటారు. అందుకే ఈ దేశానికి "ఏమిటి..?" అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. అయితే నిజంగానే ఇక్కడకు వెళ్లాక అందరికీ జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న ఉదయించకమానదు. ఎందుకంటే మకౌ పూర్తిగా విలాసవంతమైన దేశం. విలాసవంతుల కోసం వెలసిన దేశం.

ప్రపంచంలోని విలాసవంతులంతా తమ డబ్బును డాలర్ల రూపంలోకి మార్చుకుని విలాసం పొందేందుకు మకౌ చేరుతుంటారు. ఇక్కడ లభ్యంకానిది ఏదీ ఉండదు. మందు, మాంసం, మగువ.. లాంటివన్నీ ఇక్కడ బహిరంగంగా, బేరసారాలతో లభ్యమవుతుంటాయి. ఇక్కడ ఏదీ నిషిద్ధం కాదు. ఎటు చూసినా ప్రపంచంలోని అన్నిరకాల మద్యానికి ఇక్కడ కొదువే ఉండదు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున కాసినోవాలు ఉంటాయి.

ఇక్కడి ప్రతి హోటల్ తనదైన ప్రత్యేక కాసినోవాను కలిగి ఉంటుంది. అంతేగాకుండా రూం కీతో పాటు పర్యాటకులు కాసినోవాలో ఆడేందుకు 50 హాంకాంగ్ డాలర్లను కూడా ఉచితంగా ఇస్తుంటారు. వాటికి మరో 50 హాంకాంగ్ డాలర్స్ కలిపి వంద డాలర్ల కార్డు తీసుకుని ఇక్కడ ఆడవచ్చు. ఈ దేశానికి ప్రధాన ఆర్థిక వనరులు కాసినోవాలో అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు.

FILE
మకౌ దేశాన్ని "ట్వంటీ ఫోర్ అవర్స్ సిటీ" అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే.. ఇక్కడ పగలు ఎలా వాహనాలు తిరుగుతుంటాయో.. రాత్రిళ్లు కూడా అలాగే తిరుగుతుంటాయి. కాసినోవాలు 24 గంటలపాటూ నడచిన అవి రాత్రిళ్లు మరింత వేగంగా పనిచేస్తాయి. చిరుజల్లులు పడే ఆ రాత్రులను పట్టపగలుగా మారుస్తుంటాయి అక్కడి వీధిలైట్లు. ఎటుచూసినా ఫ్లడ్ లైట్ల వెలుగులో వెలిగిపోతూ ఉంటుంది మకౌ. ఇక్కడ రాత్రిళ్లు పర్యాటక ప్రదేశాలను చూపించేందుకు టాక్సీలు సైతం సిద్ధంగా ఉంటాయి.

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. కాసినోవాల గురించే..! ఈ కాసినోవాలు విలాసాలకు, వ్యభిచారాలకు నిలయాలు. వీటిలో వ్యభిచారం బహిరంగంగానే సాగుతుంది. హోటల్ గదుల్లోకి వెళ్లగానే అమ్మాయిల ఆల్బమ్స్ పెట్టి ఉంటాయి. వాటికి ఉండే కోడ్ నెంబర్ చెప్పగానే క్షణాల్లో ఆ అమ్మాయి ప్రత్యక్షమవుతుంది. అయితే.. కాసినోవాకు వెళ్లేందుకు, అమ్మాయిల్ని పిలిపించుకునేందుకు ఎవరూ సిగ్గుపడరు, భయపడరు. పైగా అదో స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు.

ఇక్కడి మరో విశేషం... "ఫ్రీ షో"లు అనబడే లైంగిక ప్రదర్శనలు. ఒక్కో షో రెండు గంటలపాటు సాగుతుంది. వీటి టికెట్స్ పర్యాటకులు అడిగితే తెప్పిస్తారు లేదా.. ఫ్లాట్‌ఫాంపై నిలుచుంటే ఆ షో టికెట్లు అమ్మేవాళ్లే దగ్గరికి వచ్చేస్తారు. ఎలాగంటే.. కొత్తగా రిలీజైన సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతారే.. అలాగన్నమాట..! విదేశీయులకు నియమించబడిన గైడ్లు కూడా ఈ టిక్కెట్లను అమ్మి లాభాలు పొందుతుంటారు.

విలాసంతో ఓలలాడుతున్న ఈ దేశంలో సాధుతత్వం కూడా రాజ్యమేలుతోంది అనేందుకు నిదర్శనమే మకౌ‌లోని "అమ్మ టెంపుల్". ఈ ఆలయంలో గౌతమ బుద్ధుడికి స్త్రీ వేషం వేసి ఆరాధిస్తుంటారు. బుద్ధుడు ఈ ప్రపంచాన్ని ఆదుకునేందుకు స్త్రీ అవతారంలో ఇక్కడ వెలశారని స్థానికుల నమ్మకం. అందుకే బుద్ధుడికి విశ్వరూపం ఆపాదించి.. ఆయనే విశ్వరచనకారుడు, లోక రక్షకుడు, సమర్థుడని విశ్వసిస్తుంటారు.

అలాగే మకౌ ప్రజలు బుద్ధుడిని శక్తి రూపంగా కూడా ఆరాధిస్తుంటారు. ఈ అమ్మ టెంపుల్ తైఫా దీవిలో ఉంటుంది. చైనాకు అతి దగ్గర్లో మకౌ ఉంటుంది కాబట్టి.. పర్యాటకులు ముందుగా ఇక్కడికి వచ్చేందుకే ఇష్టపడుతుంటారు. ఇక్కడ హోటల్స్ ఎక్కువగా ఉండటమేగాక.. ప్రతి హోటల్ పర్యాటకులను సంతృప్తిపరిచే అన్నిరకాల హంగులనూ కలిగి ఉంటుంది.

అందుకే.. జీవితం అంటే ఏంటి..? అనే ప్రశ్నను మనలో ఉదయింపజేసే ఈ మకౌ దేశాన్ని జీవితంలో ఒక్కసారయినా చూసి వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కదూ..? ఇంకెందుకు ఆలస్యం వెంటనే మకౌ చెక్కేయండి మరి..! అయితే మీ దగ్గరుండే అమౌంట్‌నంతటినీ డాలర్లలోకి మార్చుకోవటం మాత్రం మర్చిపోరు కదూ..? ఎందుకంటే, మకౌ‌లో డాలర్లదే రాజ్యం. ఏమంటారు..?