శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. సముద్ర తీరాలు
Written By PNR

భిన్న సంప్రదాయాల సంస్కృతి మెల్‌బోర్న్ సొంతం!

FileFILE
ఆస్ట్రేలియాలోని ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆస్ట్రేలియాలో అత్యంత పేరుగాంచిన నగరాల్లో మెల్‌బోర్న్ రెండవది. ఈ దేశంలోని నగరాలన్నింటిలోకెల్లా.. మెల్‌బోర్న్ నగరాన్ని చూడటానికి యాత్రికులు అధికంగా ఇష్టపడుతారు.

అక్కడి వాతావరణం, ప్రకృతి ఎంతగానో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇలాంటి మెల్‌బోర్న్‌లో చూడదగిన ప్రదేశాల్లో ప్రధానంగా క్వీన్స్‌ల్యాండ్‌, ల్యామ్నింటన్‌ నేషనల్‌ పార్కు, రాయల్‌ బొటానిక్‌ గార్డెన్‌, ఆక్వేరియంలు ముందు వరుసలో ఉంటాయి.

ఇది విక్టోరియా రాష్ట్రానికి ముఖ్య పట్టణం. ఇక్కడ 3.8 మిలియన్‌ ప్రజలు నివసిస్తున్నారు. ఈ నగరానికి పక్కన యర్రానది ఉంది. ఈ నగరం పరిశ్రమలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య కేంద్రంగా మారింది. ఆస్ట్రేలియా క్రీడలకు, సంస్కృతికి ముఖ్య పట్టణంగా మెల్‌బోర్న్‌ని గుర్తించారు.

ఇక్కడ సమాజం భిన్న సాంప్రదాయాలకు వేదికగా ఉంది. ఇది అనేక అంతర్జాతీయ సదస్సులకు, కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆతిథ్యం ఇచ్చిన కార్యక్రమాల్లో 1956 సమ్మర్‌ ఒలింపిక్స్, 2006 కామెన్‌వెల్త్ గేమ్స్‌‍లను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

మెల్‌బోర్న్ ఆక్వేరియం: ఇది పెద్ద ఆక్వేరియం. ఇందులో అనేకరకాల చేపలుంటాయి. ప్రత్యేకించి షార్క్ చేపలను చూడొచ్చు. చేపలకు ఆహారం వేసే సమయంలో దగ్గర్నుంచి చూడడానికి వీలుంటుంది.

రాయల్‌ బొటానిక్‌ గార్డెన్‌: ఆస్ట్రేలియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద సుందరమైన గార్డెన్‌ల్లో ఇదొకటి. ఇది మెల్‌బోర్న్ నగరానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందంటే ఎంత అందంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. దీని పక్కనే యర్రా నది ఉండడం వల్ల ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఈ పార్కులో ఉంటే సమయం కరిగి పోవడమే తెలియదంటారు పర్యాటకులు.

ఇందులోని సరస్సులో బాతులు, హంసలు, ఈల్‌లు తిరుగుతున్న దృశ్యాలు ఎంతో ఆహ్లాదకరంగా, రమణీయంగా ఉంటుంది. అందుకే బొటానిక్‌ గార్డెన్‌ని చూడ్డానికి వెళ్లేటప్పుడు అక్కడే ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.

మెల్‌బోర్న్‌లో ఖరీదు కలిగిన రెస్టారెంట్‌లతో పాటు సింగ్‌ల్‌గా ఉన్నవారికి నగరం మధ్యలో హాస్టల్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల పబ్‌లు, నైట్‌క్లబ్‌లు, బార్‌లు ఉన్నాయి. సంవత్సరం పొడవునా సందర్శకులను ఆకట్టుకునే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.