మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 112 పాయింట్లు వృద్ధి చెంది, 17,670 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు పుంజుకుని, 5,271 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.